సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పరిధిలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జిల్లా పరిషత్‌కు చెందిన సుమారు 15 సెంట్ల స్థలంలో స్థానిక గ్రామస్థులు నిర్మిస్తున్న శివాలయం నిర్మాణం ఆపాలని ఇద్దరు స్థానికులు రాష్ట్ర హైకోర్టు కు వెళ్లడంతో కేసు నడుస్తున్నా నేపథ్యంలో.. అధికారుల అడ్డుకోకపోవడంతో ఆలయంలో గ్రామస్తులు విగ్రహాలు పెట్టడంపై జిల్లా కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనికి బాద్యులుగా నలుగురు అధికారులను సస్పెండ్ చేసారు. వీరిలో పెంటపాడు తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఈవోపీఆర్‌డీ వైవీఆర్ ప్రసాద్‌తో పాటు, ప్రత్తిపాడు పంచాయతీ కార్యదర్శి జవ్వాది నాగేశ్వరరావు, వీఆర్‌వోలను సస్పెండ్ చేస్తూ తాజగా.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక తాడేపల్లిగూడెం ఆర్‌డీవో, డీఎల్ డీవోలకు మోమో జారీచేశారు. వీరితోపాటు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ, పెంటపాడు ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 5వ తేదీన హైకోర్టు లో ఈ కేసు విచారణకు రానున్నది. శివాలయ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులు కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.
