సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని, రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనస్సులో మోహన్ రంగ శాశ్వతంగా నిలిచిపోయారని.ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం తహసిల్దార్ కార్యాలయ రోడ్డులోని.. వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద రాధ రంగ మిత్ర మండలి అధ్వర్యంలో మోహన్ రంగ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు, శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వారి త్యాగం మరువలేనిదని, వారి ఖ్యాతి చెదరదన్నారు. రాధా రంగ మిత్ర మండలి పట్టణ అధ్యక్షులు అగ్గిశేట్టి సిడ్నీ, సాధనాల బాల, అదిమూలం మూర్తి మాట్లాడుతూ.. మా సంఘ సభ్యుల సహకారంతో ప్రతి ఏడాది మోహన్ రంగ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అనంతరం వృద్దులకు పేదలకు పండ్లు, భోజనాలు పంపిణి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *