సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అడ్డు అదుపు లేకుండా బంగారం(gold).. దానికి పోటీగా మరోవైపు వెండి (silver) ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగారం ధరల కంటే వెండి ధరలు హడలెత్తిస్తున్నాయి. నేడు, శుక్రవారం దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.2,40,000 పైగానే కొనసాగుతోంది. నేడు ఒక్క రోజులోనే వెండి ధర రూ. 6 వేలకు పైగా పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. నేటి శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దేశీయ మార్కెట్‌లో వెండి గ్రాముకు రూ. 6 పెరిగింది. కేజీకి రూ. 6000 పెరిగింది. తాజాగా ..పెరిగిన ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ నగరాలలో 2,54,000 ఉండగా ఢిల్లీ , ముంబై, కర్ణాటక, కలకత్తా మర్కెట్స్ లో మాత్రం 2,40,000 కు లభ్యం అవుతుంది.
