సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు, ఆదివారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు.సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి ఖడ్గే మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో 140 ఏళ్ళు గా భారత్ లో ప్రజా ప్రాధాన్యత తో నడుస్తున్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ కు సుస్థిర స్తానం ఉందని, విలువలు పాటిస్తోందని, అంతేకాని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లాగా కుల మత విద్వేషాలు రెచ్చగోటి ప్రజల ఓట్లు ఆడుకొనే పార్టీ కాదని విమర్శించారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక చరిత్రాత్మక మార్పులు వచ్చాయని, గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని మార్చామని తెలిపారు. ఇప్పుడు మా శక్తి తగ్గింది కావచ్చు.. కానీ పోరాటం ఆగలేదు‘ అంటూ ఖర్గే స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఆరోపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *