సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఆదివారం నరసాపురం లంక గ్రామాలలో (పేదవాని లంక లో) పర్యటిస్తున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, నిర్మల సీతారామన్ కు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. సీతారామన్ ఈ ప్రాంత కోడలి గా ఇక్కడి అభివృధి కి తన వంతు సహకారం అందిస్తూ.. తాను దత్తత తీసుకొన్న లంక గ్రామాలలో అభివృద్ధి ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో , రాష్ట్ర బీజేపీ అడ్జక్షుడు, మాధవ్ , నీటి పారుదల శాఖ మంత్రి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ప్రాంత అభివృద్ధి కి కేంద్రం నుండి తన వంతు సహకారం అందిస్తానని, ఇక్కడ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంతో చొరవతో శరవేగంగా చేస్తున్న అభివృద్ధి ప్రసంశనీయం అని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.
