సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా నెల రోజులు పాటు జరిగే 62వ వార్షికోత్సవం జనవరి 13 నుండి ప్రారంభిస్తున్న నేపథ్యంలో సందర్భంగా ఈనెల 17వ తేదీన మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. నేటి సోమవారం ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి ఉదయం 11-30 నిమిషాలకు అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు అమ్మవారిని దర్శించుకుని అర్చకులతో మాట్లాడారు. శ్రీ అమ్మవారి రూపం తేజస్సుతో ఉందని, ఇకపై అమ్మవారి మూల విరాట్ దగ్గర కర్పూరం వద్దని, ఎక్కువ పొగ రావడంతో విగ్రహానికి దూపం మసక పట్టేస్తుందని,దీనికి తగిన ఆలోచన చేసి అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించాలని అన్నారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *