సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం యనమదుర్రు లోని ‘స్వయం భువుడు’ శ్రీపార్వతీ సమేత శక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు నేడు, సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా నడపన రాము, సభ్యులుగా అనిశెట్టి శక్తీశ్వరరావు, తోట రాజ్యలక్ష్మి, మేకల వరలక్ష్మి, కొట్టాడ శ్రీను, కండిబోయిన మంగతాయారు, మద్దిరాల దుర్గాభవాని, మజ్జి అనూష, లంకపల్లి నాగేశ్వరరావు, కాళి శ్రీనులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ .. దేవాలయాల అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, పురాణ ప్రాశస్యం ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి పాలకవర్గ సభ్యులుగా నియమితులు కావడం భగవత్ సేవ యేనని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.
