సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం ఈలంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సోమవారం ఈలంపూడి గ్రామంలో నిర్వహించారు. చైర్మన్ గా మంతెన త్రినాథ రాజు డైరెక్టర్లుగా యర్రంశెట్టి లక్ష్మణ్, బొక్కా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా త్రిసభ్య కమిటీ పని చేయాలని, సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ .. త్రిసభ్య కమిటీ సభ్యులు కలిసికట్టుగా పనిచేస్తూ రైతులకు వెన్నుదన్నుగా ఉండాలన్నారు. బ్యాంకు సంబంధించి ఏ అవసరం ఉన్న ఆఫ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. మంచి అభివృధి లో ఈలంపూడి సొసైటీ సంఘాన్ని నడిపించాలన్నారు. కార్యక్రమంలో భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ , సుజాత రామచంద్ర రాజు,గ్రామస్తులు, సర్పంచ్లు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *