సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు భారీ ఊరట దక్కింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, గత జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్ ను అడ్డుకొంటూ .. దానిలో రిజర్వేషన్ల విధానం సరిగా లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ, నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను నేడు, మంగళవారం తిరస్కరించింది.
