సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అడ్డ వంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీ రామానుజ చినజీయర్ ఆధ్వర్యంలో, భక్తులచే నూతనముగా నిర్మించబడిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయములో నేడు, మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము అంగరంగ వైభవముగా జరిగినది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అచ్యుత రామ రాజు గుండు వెంకన్న బాబు, చవ్వా శ్రీనివాస్ సుబ్బారావు, కంచర్ల అమ్మిరాజు విశ్వనాథ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సౌకర్యములు కల్పించారు.
