సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. గత సోమవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెల్పింది. కొత్త జిల్లాలు ఈ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28కి చేరింది.ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం కొత్త జిల్లాలుగా ప్రకటించారు. దీనితో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 జిల్లాలుగా మారింది. మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసారు. సీఎం చంద్రబాబు కాబినెట్ ఆదేశాలతో కొత్త జిల్లాల ఏర్పా టుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది
