సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే ప్రభాస్ రాజసాబ్ ట్రైలర్ విడుదలయి ఇదికదా సినిమా అనే రేంజ్ లో బిల్డుప్ తో డార్లింగ్ ప్యాన్స్ కాలర్ ఎగురవేసే స్థాయిలో దుమ్ము దులుపుతుంటే.. సంక్రాంతి బరిలో దిగుతున్న మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుండి థర్డ్ సింగిల్ పాట నేడు, మంగళవారం గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో విడుదలయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో శుభసూచకంగా ఈ పాటను రిలీజ్ చేయడం విశేషం!. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్ లో వేసిన చిందులు అభిమానులకు మంచి జోష్ సొంతం చేస్తున్నాయి… “మార్నింగ్ గ్రీన్ టీ… నైటయితే నైంటీ…” అంటూ మొదలయ్యే ఈ పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది… భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ లో రూపొందిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ నిర్వహించారు ఈ పాటలో చిరంజీవి వెంకీని ‘చంటి’ అంటూ సంబోధించడం, వెంకీ బదులుగా ‘బాసూ’ అంటూ పిలవడం ఫ్యాన్స్ కు మరింత కిక్కునిస్తోంది. సీనియర్ అగ్రహీరోలు చిరు వెంకీ,బాలయ్య, నాగ్ .. నలుగురు హీరోల్లో ఎవరూ ఒకరితో ఒకరు కలసి నటించలేదు… ఆ ఫీట్ ను చిరంజీవి, వెంకటేశ్ ముందుగా చేయడం గమనార్హం! ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకటేశ్ కీలక పాత్రలో 30 నిమిషాల నిడివి పాత్రలో కనిపించనున్నారు… చిరు, వెంకీ ఇద్దరిపై రూపొందించిన సాంగ్ ఈ సినిమా అంచనాలను మరింత పెంచేసింది.
