సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన సంవత్సర వేడుకలు విదేశాలలో జరుపుకొనేందుకు గత రాత్రి (డిసెంబర్ 30వ తేదీన) సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జనవరి 4వ తేదీన ఆయన తిరిగి అమరావతి చేరుకోనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నేటి బుధవారం నుండి ప్రారంభించారు. డిసెంబర్ 31వ తేదీన.. ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ. 2,743 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా జనవరి 1వ తేదీ సెలవు కావున ఎవరైనా లబ్దిదారులకు పించన్ అందక పొతే జనవరి 2న అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *