సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆధ్వర్యంలో సీపీఐ అగ్రనేత ఎబి బర్ధన్ 10వ వర్దంతి సంధర్భంగా నేడు, శుక్రవారం బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసీ నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ.. దేశంలో మతతత్వ శక్తులు అధికారంలోకి రానివ్వకుండా లౌకిక శక్తులను ఏకం చేసి యుపీఏ 1 ప్రభుత్వం అధికారంలోకి తేవడంలో బర్ధన్ కీలక పాత్ర నిర్వహించారన్నారు.ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా,సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన బర్ధన్ కార్మికులు, కర్షకకులు,అట్టడుగు అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి జీవితాంతం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు చెల్లబోయిన రంగారావు,ఎం.సీతారాం ప్రసాద్, వైవీ ఆనంద్, మల్లుల శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి నాయకుడు ఛాన్ భాషా తదితరులు బర్ధన్ కు నివాళులర్పిచారు.
