సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (World Telugu Conference) నేడు, శనివారం ప్రారంభమయ్యాయి. తొలిగా శ్రీనివాస కల్యాణ కార్యక్రమంతో తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇక నేటి నుంచి ఈనెల 5 వరకు మూడో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు 3రోజుల పాటు జరుగనున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పలువురికి పురస్కారాలను అందజేయనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఈరోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హాజరుకానున్నారు. రేపు (ఆదివారం) ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం. ఇక సోమవారం నాడు 3వ రోజు జరిగే మహాసభల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu ), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *