సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారికీ ఇష్టమైన ప్రధాన పండుగ సంక్రాంతి మరి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలే. మరి కోడిపందాల రాజధాని అంటే .సంక్రాంతి పండుగల సందడి చూడాలంటే.. శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాల సందడి అంటే భీమవరమే.. అని నానుడి.. ఈసారి పోలీస్ కట్టడి ఎక్కువగానే ఉంటుందని వార్తలు వస్తున్నా, పండుగ 3 రోజులు ఇబ్బంది ఉండదనేది పెద్దోళ్ల మాట.. మరి ఎవరి భరోసా నిజం అవుతుందో చూడాలి. మరో 9 రోజుల్లోనే సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో అప్పుడే చాలా మంది పందాల ఏర్పాట్లు లోకి వెళ్లిపోయారు. నిర్వాహకులు బరులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాలలో ప్రముఖ లాడ్జిలు గెస్ట్ హౌస్ లు దూరప్రాంతాల నుండి వచ్చే ప్రముఖుల, అతిధులు, బెట్టింగ్ వ్యాపారుల కోసం భారీ రెంట్స్ కు హౌస్ ఫుల్ అయ్యిపోయాయి. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలలో చిన్నా పెద్దా కలిపి సుమారు వెయ్యి కి పైగా బరులు వెలుస్తాయనే సమాచారం ఉంది.. పందేలకు తగినట్టు కత్తులు తయారుచేసే పనిలో పలువురు నిమగ్నమయ్యారు. ఇటీవల గోకవరంలో కోడి కత్తులతో పలువురు పట్టుబడిన సంఘటన సంచలనం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *