సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లా లో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నేడు, ఆదివారం ఉదయం ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ కావడంతో, భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధం అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలోనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్‌వేను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రయల్ రన్ విజయంతో రన్‌వే సామర్థ్యం, భద్రతా ప్రమాణాలపై అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్నికల్ పరీక్షలు, ఆపరేషనల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *