సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాలభివృద్దికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు రూ 100 కోట్లు నిధులు అందిస్తున్నారని, గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడమే పల్లె పండగ ముఖ్య ఉద్దేశ్యమని, పలు గ్రామంలో, ఇకపై అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేస్తున్నామని, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, ఆదివారం భీమవరం మండలంలోని పలు గ్రామంలో,రూ 1కోటి 49 లక్షల 50 వేల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. నాగిడిపాలెంలో రూ 22 లక్షలతో సీసీ రోడ్డు, దెయ్యలతిప్పలో రూ 15 లక్షలతో సీసీ రోడ్డు, కోమటితిప్పలో రూ 83 లక్షలతో రోడ్డు, దిరుసుమర్రు, రామాయణ పురంలో రూ 20 లక్షలతో సీసీ రోడ్డు, యనమదుర్రులో రూ 9.50 లక్షలతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *