సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగలకు మాత్రమే కాదు ఆక్వా వ్యవసాయానికి ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం ప్రాంతంలో రొయ్యల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం సముద్ర రొయ్యతో పాటు మంచి నీటి రొయ్య వానమికి సైతం గత 15రోజులుగా నుండి మంచి ధర పలుకుతుంది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళా రిటైల్ వ్యాపారానికి కూడా మంచి డిమాండ్ పెరిగింది. పట్టుబడికి వచ్చిన కేజీ 20 రొయ్యల కౌంట్ 540, రూపాయలకు, 25 కౌంట్ రూ. 500,లకు, ఇక కీలకమైన ఎక్కువ కొనుగోలు ఉండే 30 కౌంట్ రూ . 460, 40 కౌంట్ రూ . 390, ఇంకా 45 కౌంట్ రూ ..370, 50 కౌం ట్ రూ . 360, మరియు 90 కౌంట్ రూ .275, 100 కౌంట్ రూ .255 ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం నుండి ఎక్కువ గా అంటే పండిన 100 శాతం రొయ్యలో 55 శాతం పైగా అమెరికా కే ఎగుమతి అయ్యి వేల కోట్ల డాలర్స్ ఆదాయం దేశానికీ లభిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యిప్పటికే 50 శాతం పన్నులు పెంచడంతో ఎదో రకంగా నెట్టుకొస్తున్న రొయ్య రైతులకు ఎగుమతి వ్యాపారులకు ఇటీవల మరో మారు ట్రంప్ 500 శాతం పన్నులు పెంచేస్తానని బెదింపులు ప్రకటించడం ఆందోళన రేకిస్తుంది.నిజంగా అదే జరిగితే మాత్రం భీమవరం ప్రాంత ఆక్వా రంగానికి పెను ముప్పు పొంది ఉంది. వచ్చే ఫిబ్రవరి, మార్చీ నెలలలో తరువాత ఎక్కువ మంది రైతులు రొయ్యలు పంట వేస్తారు.. కాబ్బటి మరో 2వారాలలో అమెరికా వైఖరి తేలుతుంది బట్టి వారు చెరువుల లోకి దిగుతారో లేదో తేలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *