సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:. నేడు, ఆదివారం ఉదయం భీమవరం 35వ వార్డు ఆదర్శ నగర్ పార్క్ లో జనసేన నాయకులు కొప్పినిడి బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే అంజిబాబు భోగి మంటలను వేసి ప్రారంభించారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందు భోగి మంటలు రంగవల్లుల శోభతో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయన్నారు. సంక్రాంతి పండుగతో భీమవరం నియోజక వర్గంలో ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. ముందుగా భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. రంగవల్లులోని విజేతలకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సాగిరాజు అప్పలరాజు, కొప్పినీడి బాబీ, దాట్ల కృష్ణంరాజు, గాదిరాజు శ్రీనివాస్ రాజు, మంతెన కృష్ణంరాజు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *