సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో నేడు, ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. ఈ జనవరి 13 వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాలలో,దేశంలో ప్రఖ్యాతి గాంచిన భీమవరం పురాధీశ్వరి’ శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 62వ వార్షికోత్సవాలు‘ ప్రారంభిస్తున్నామని ఉదయం 7గంటలకు ఆలయంలో పూజ నిర్వహిస్తారని , మధ్యాహ్నం శ్రీ అమ్మవారికి మేళ తాళాలతో నగరోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభిస్తారని, సాయంత్రం 5గంటల నుండి కళావేదికపై సాంసృతిక కార్యక్రమాలను మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నెల 13 వ తేదీ వరకు 39 రోజుల పాటు సుమారు కోటి రూపాయల ఖర్చుతో నిర్వహించే ఈ వేడుకలలో ( రాష్ట్ర దేవాదాయ శాఖ 15 లక్షలు సమకూరుస్తుంది) ప్రతి రోజు నాటకాలు, మ్యూజికల్ నైట్స్ తో పాటు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు, ప్రవచనాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమౌతాయని ప్రకటించారు.. కళాప్రదర్శనలు పిబ్రవరి 10వ తేదీతో ముగుస్తాయని ఇక ఉత్సవాలు ముగింపుగా ఫిబ్రవరి 13 వ తేదీన ఉదయం 8 గంటల నుండి లక్ష మందికి విందుభోజనాలతో అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు ,ఈవేడుకలకు ప్రభుత్వ అధికారులు, మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భముగా వార్షికోత్సవాల పోస్టర్ ను కమిటీ సభ్యులు విడుదల చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *