సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:సంక్రాంతి వచ్చిందంటేనే జనవరి మొదటి వారం నుండే భీమవరం మార్కెట్లు జోష్ అందుకొంటాయి. ఎక్కడ చుసిన దూరప్రాంతాల నుండి వచ్చే వాహనాల ట్రాఫిక్ జామ్ లు కనిపిస్తాయి. అయితే ఈసారి చాల ఆలస్యంగా పండుగకు 3 రోజుల నుండి ట్రాఫిక్ లు గత 3 రోజులుగా జామ్ అవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే మార్కెట్ లో బాగా స్లంప్ ఉందనిఈ 3 రోజులు కూడా షాపులలో చూసేందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప గతంలోలాగా ఎవరు కొనుగుళ్ళు చెయ్యడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. సామాన్య జనం దగ్గర డబ్బు తగ్గిపోయిందని, ఉన్నత వర్గాలు ఇక్కడ కన్నా విజయవాడ హైదరాబాద్ లలో కొనుగోళ్లు చేస్తున్నారని, భీమవరంలో ఎన్ని కొత్తగా బ్రాండెడ్ షో రూమ్ లు ప్రారంభిస్తున్నఆస్తాయి అమ్మకాలు జరగటం లేదని, ‘ఆన్ లైన్ బిజినెస్’ కూడా పెద్దగా ప్రభావం చూపిస్తుందని వ్యాపారులు అంటున్నారు. భీమవరంలోనే ప్రముఖ వస్త్ర సంస్థల ప్రముఖులు మన సిగ్మా న్యూస్ తో వాపోయారు. ఇక బంగారం ధర బాగా పెరిగిపోవడం తో జ్యువెలరీ షాప్ లలో కూడా కొనుగోళ్లు తగ్గిపోయాయి. అయితే పండుగకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ రోజున కొత్త వాహనాలు కొనుగోలు కోసం మోటార్‌ సైకిళ్ల షోరూంలు, కార్ల షోరూంలు అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఉంటాయి. అవి కూడా ఆశాజనంకంగా లేవు. గతంతో పోలిస్తే మోటార్‌ సైకిల్స్‌ షోరూమ్స్‌లో మెగా లోన్‌ అండ్‌ ఎక్చేంజ్‌ మేళాలు కూడా ఈ ఏడాది తక్కువే.. . ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో 75 ఇంచెస్ టివిలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మిషన్లు, మైక్రోఓవెన్స్‌, మిక్సీలు వంటి సామాగ్రి కొనుగోళ్లు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. దేశంలో ‘ఆతిద్యల రాజధాని భీమవరం’లో రెస్టారెంట్స్ స్వీట్స్, లాడ్జి లు గెస్ట్ హౌస్ ల వ్యాపారం మాత్రం తగ్గేదే లే.. అన్నట్లు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *