సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇరాన్లో అంత్యర్యుద్దం రగిలిపోతుంది. ప్రజలు దేశాధినేతపై తిరుగుబాటు చేసారు. ఘర్షణల్లో ఇప్పటివరకు 544 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. వీరిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలచిపోయాయి. అమెరికా దళాలు ఏ క్షణానైనా ఇరాన్ పైదాడి చేసి కీలకనేతలు ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిపై తాజగా అమెరికా అడ్జక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న ఇరాన్ నాయకత్వం దిగొచ్చినట్టు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని ట్రంప్ పేర్కొన్నారు.. అమెరికా చేతిలో దెబ్బలు తిని ఇరాన్ నేతలకు విసుగు వచ్చి ఉంటుందని, అందుకే వెనక్కి తగ్గారని ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు. అక్కడి నాయకులు పరిమితులు దాటి హింసతోనే దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ దేశ పరిస్థితిని మేం నిశితంగా గమనిస్తున్నాం. త్వరలోనే ఇరాన్ నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలిపారు
