సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఆకివీడు మండలం, దుంపగడప గ్రామంలోని ఉప్పుటేరు వంతెన వద్ద గతంలో నిర్మించి పూర్తిగా విస్మరించిన “సర్ ఆర్థర్ కాటన్ పార్క్” ను సరికొత్తగా ఆధునీకరించి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు జిల్లా కలెక్టర్, సి. నాగరాణి కల్సి పునః ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా TDP అధ్యక్షులు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. అక్కడ సంక్రాంతి వేడుకలలో సరదాగా మినీ ఎద్దుల బండిని రఘురామా అధిరోహించారు. ఈ పార్కు ఆవరణలో రెస్టారెంట్, ఫంక్షన్ హాల్, పిల్లల కోసం ఆట స్థలంను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే పార్కు పక్కనే ఉన్న ఉప్పుటేరులో బోటింగ్, స్పీడ్ బోట్స్, హౌస్ బోట్స్ వంటివి త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని రఘురామ తెలిపారు. గత సోమవారం సాయంత్రం, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీఅల్లూరి సీతారామరాజు స్వగ్రామమైన మోగల్లు మేజర్ పంచాయతీలో 1.93 కోట్ల వ్యయంతో మెయిన్ కెనాల్ నుండి ఊరి చెరువు వరకు 5 కిలోమీటర్ల మేర రక్షిత తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్, 1.0 MLD మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ ను రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో బాధపడిన ఈ గ్రామ మహిళల కళ్లలో నేడు చూసిన ఆనందం నాకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన రామరాజు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్, కొత్తపల్లి నాగరాజు కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *