సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సంక్రాంతి సందడి ని మరో ఫై మెట్టు ఎక్కించేలా నభూతో నభవిశ్యత్తు అన్నరీతిలో పెద అమిరంలోని తన నివాసం వద్ద గత రాత్రి నుండి నేటి బుధవారం తెల్లవారు జాము వరకు వైభవంగా జరిగిన భోగి వేడుకలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కుటుంబ సమేతంగా, మిత్రులతో పాల్గొన్నారు.జాతీయ స్థాయి కళాకారులతో చక్కని పాటలు, మహిళలకు ఎన్నో సాంప్రదాయ ఆటలు, తంబోలా, కాంతారా షో, ఈజిప్షియన్ షో లు మ్యూజికల్ నైట్ లు అద్భుతంగా మనం ఉన్నది భీమవరం లోనా ? అన్నంత లావిష్ గా అంతర్జాతీయ స్థాయి లుక్ తో నిర్వహించారు.సంక్రాంతి కళ అక్కడే ఉన్నట్లు సెట్స్, గోపూజ లు, హరిదాసు, గంగిరెద్దులు ఒకటే కోలాహలం భారీ భోగిమంటలువెలిగించారు. ఈ వేడుకలలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నేటి బుధవారం ఉదయం సాంప్రదాయ కోడి పందాలను రఘురామా నివాస ఆవరణలోనే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *