సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి భీమవరం సంక్రాంతి పండుగ సంబరాలలో భీమవరం పట్టణం చుట్టుపక్కల గ్రామాల లో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అతిధులు సందడి మాములుగా లేదు. ఆఖరికి ఈసారి చాల మందికి ఎన్ని వేలు ఇచ్చిన వసతి లేక కారులు అపి స్థానిక పంటకాల్వల వద్ద స్తనాలు ఇతరాత్ర కార్యక్రమాలు పూర్తీ చేస్తున్న దృశ్యాలు కోకొల్లలు. (వచ్చే సంక్రాంతికి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.) ఎక్కడికక్కడ భారీ సంక్రాంతి సాంప్రదాయ కార్యక్రమాల వేదికలు, భారీ భారీ కోడిపందాల బరులు మందు విందు ల కోలాహలంలో స్థానిక నేతలు కూడా పోటీ పడ్డారు. కారణాలు ఏవైనా ఈ 3 రోజుల సందడిలో వందల కోట్ల రూపాయల డబ్బు భీమవరంలో వర్షంలా కురిసింది అని చెప్పవచ్చు.. ఇక ఈసారి భీమవరంలో ఎన్ని పండుగ టెంట్ లు ఎన్ని ఉన్న.. రఘురామా’ సంక్రాంతి సందడికి RRR ఒక బ్రాండ్ గా అవతరించారని చెప్పవచ్చు.. పెదమిరం పరిసరాలలో ఒకటా రెండా ఎన్నో సంక్రాంతి వినోదాలు, ఆకాశయానానికి గైడర్స్ బెలూన్స్ ఆ భారీ ఏర్పాట్లు హడావిడి అంతా ఇంత కాదు..ఇక్కడకు వచ్చినవారిలో ఎందరో ప్రముఖులతో పాటు, సగం మంది తెలంగాణ వాసులే కావడం గమనార్హం. నేడు శుక్రవారం విక్టరీ వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు హాజరు అయ్యా రు.భీమవరం స్థానికులతో పాటు వేలాది అతిధులు మహిళలు, చిన్నారులు సైతం దొరికిన వాహనంలో కుప్పలు తెప్పలుగా అక్కడ చేరి ఆహ్లద వాతావరణంలో పండగ సంబరాలలో పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేక సిటింగ్ భోజన ఏర్పాట్లు చెయ్యడం విశేషం.
