సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి తెలుగు వారి సంక్రాంతి పండుగ సినిమాలలో పోటీ 2లేదా మూడు సినిమాల మధ్య కాదు ఏకంగా 5 సినిమాల మధ్య ప్రధాన పోటీ అయ్యితే వీటిలో కారణాలు ఏవైనా మిక్సిడ్ టాక్ తెచ్చుకొన్న సినిమా భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్. అయితే ఈ పండుగ సీజన్ లో మొదటి 200 కోట్ల కలెక్షన్ కేవలం 5 రోజులకే అధిగమించి ప్రభాస్ ఎప్పుడైనా ఎక్కడున్నా ‘రాజాధి రాజే’..అని సత్తా చాటాడు..అయితే 7 రోజులకు 238 కోట్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. భీమవరంలో కేవలం 7 రోజులకే 1 కోటి 10 లక్షల రూపాయలు కలెక్షన్ సాధించి అందరి మతులు పోగొట్టాడు ప్రభాస్.. ఇక చిరంజీవి వెంకీ కాంబినేషన్లో వచ్చిన శంకర వర ప్రసాద్ కూడా అమోఘ విజయం సాధించింది. ఈ సినిమా కూడా 200 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.( 4రోజులకు 190కోట్లు..) భీమవరంలో 4 రోజులకు 64 లక్షల వసూళ్లు సాదించింది. ఇక రవితేజ భర్త మహాశయులకు.. 3 రోజులకు 6 లక్షలు , నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు.. 2 రోజులకు 7న్నర లక్షలు, శర్వానంద్ నారీనారీ నడుమ మురారి.. 2 లక్షలు వసూళ్లు సాధించాయి.
