సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి సంక్రాంతి రోజులలో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది..పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయి. కాస్త ఉక్కబోత కూడా మొదలయింది. ఇక రాష్ట్రంలో. ఈశాన్య రుతుపవనాల వర్షాలు నిష్క్రమించటానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ సమీపంలోని యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉత్తర ఆంధ్ర గోదావరి జిల్లాలలో లో రేపు -శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు ప్రాంతాలలో మాత్రమే చోట్ల కురిసే అవకాశము ఉంది.రాయలసీమలో కూడా పొడి వాతావరణమే ఉంటుంది.
