సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల లో సంక్రాంతి (Sankranti) పండక్కి సొంతూర్లకు వచ్చిఆహ్లదంగా గడిపిన వారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అతిధులు తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రవేటు వాహనాల బాదుడు భారీగా ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ కు ముందు ఏపీ ఆర్టీసీ బస్సులు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్‌కు నడవగా, ప్రస్తుతం నేటి శనివారం నుండి రేపు ఆదివారం కూడా ప్రతిరోజూ 70కు తగ్గకుండా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుండటం గమనార్హం. భీమవరం, రాజమండ్రి, నరసాపురం, రాజోలు, అమలాపురం, కాకినాడ, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి పీఎన్బీఎస్‌కు స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేటు అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *