సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ అసోసియేషన్ భవనం దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు కుటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ ఐటి మంత్రిగా పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారన్నారు. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఏపీ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఇటీవల తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.అన్న క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించారు. వెంకటేశ్వర బదిలీల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు టిడిపి కార్యదర్శి గంధం రాధ టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *