సిగ్మా తెలుగు డాట్, న్యూస్: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం(పిఠాపురం) షష్ట పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా 81వ వర్ధంతి సందర్భంగా నేడు శుక్రవారం భీమవరంలోని స్థానిక త్యాగరాజ భవనంలో సమితి 33 వ వార్షికోత్సవ సభ, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన జరిగిన సాహితీ సమావేశంలో ప్రముఖ కవి విమర్శకులు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా దక్షిణాసియా శాఖ అధ్యాపకులు ఆచార్య అఫ్సర్ కు డాక్టర్ ఉమర్ ఆలీషా పురస్కారాన్ని 50 వేల నూట పదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అఫ్సర్ మాట్లాడుతూ ఉమర్ ఖయ్యామ్ గ్రంథాన్ని పారశీక మూలం నుంచి గ్రహించి ఉమర్ ఆలీషా తెలుగులో అందించడం విశేషమన్నారు. ఉమర్ ఖయ్యామ్ గ్రంధం వెలువడి 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ పురస్కారం అందుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు. తదుపరి ప్రస్తుత పీఠాధిపతి సాహితీ సమితి అధ్యక్షులు, డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ శతాబ్దం క్రితమే అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్త్రీల సమస్యలు, మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలపై సమాజాన్ని జాగృతం చేస్తూ ఆరవ పీఠాధిపతి డాక్టరు ఉమర్ ఆలీషా చేసిన రచనల గురించి వివరించారు. సమాజాన్ని చెతన్య పరిచేలా సుమారు 50 పుస్తకాలు రచించారని అన్నారు. 33 సంవత్సరాలనుండి భీమవరం కేంద్రంగా డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితిని విజయవంతంగా నడిపిస్తున్న సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ బధరీనాధ్, సమితి ఉపాధ్యక్షులు త్సవటపల్లి మురళీకృష్ణ, కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, కోశాధికారి వడ్డాది వెంకటేశ్వర శర్మ, బుద్ధరాజు రామకృష్ణంరాజు, వానపల్లి రమేష్,త్సవటపల్లి ఉమామహేశ్వరరావు, దండు కృష్ణంరాజు, వేగేశ్న సత్యవతి, దండు సుభద్రాదేవి, వడ్డి విజయలక్ష్మి,త్సవటపల్లి సాయి వెంకన్నబాబు, టివివి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
