సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతో పుణ్యం చేస్తేనే దేవుని కొలువు దొరుకుతుంది అని పెద్దలు అంటారు. మరి అటువంటి కొలువులో ఉండే ఉద్యోగులు ఎంత బాధ్యతగా పనిచేయాలి? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అన్నవరం సత్యదేవుని పవిత్ర ప్రసాదం నిల్వ బుట్టల్లో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్న వీడియో, ఉద్యోగుల నిరక్ష్య సమాధానం.. ఇటీవల విపరీతంగా వైరల్ అయింది. భక్తుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు వెంటనే స్పందించి, ప్రసాదం నిల్వ క్యాబిన్‌కు మరమ్మతులు చేయించి, ఇద్దరు ఆలయ సిబ్బందిని తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.( ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఈచర్యలు సరిపోతాయా?) వివరాలలోకి వెళ్ళితే.. అన్నవరం నమూనాలయం జాతీయ రహదారిపై ఉండటం వల్ల ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ప్రసాదం కొనుగోలు చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య కొందరు భక్తులు అక్కడికి వచ్చారు. స్వామివారి ప్రసాదం ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో ఎలుకలు తిరుగుతుండటాన్ని గమనించారు. వెంటనే ఈ వీడియోను మొబైల్లో రికార్డ్ చేశారు
