సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎందుకూ పనికిరాకుండా పడి ఉండే వస్తువులను తీసుకుని వాటికి బదులు నిత్యావసరాలను నేరుగా ఇంటివద్దే అందిస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని నేడు శనివారం వారివురు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటికి ప్రతిగా నిత్యావసర సరుకులను అందించే స్వచ్ఛ రథం పథకాన్ని ప్రారంభించామని, ప్రజల నుంచి పాత ప్లాస్టిక్‌ డబ్బాలు, మిల్క్‌ ప్యాకెట్లు, పాలిథిన్‌ కవర్లు, ఐరన్‌, స్టీల్‌ వంటి 29 రకాల వస్తువులను ప్రజల నుంచి సేకరించి అందుకు ప్రతిగా కొబ్బరి నూనె, సర్ఫ్‌, నూనె, గోధుమపిండి, మినపపప్పు, కంఫర్టు వంటి 12 రకాల సరుకులను అందజేస్తామన్నారు. కేజీ పాత ఇనుము రూ 20, పేపర్లు రూ15, పుస్తకాలు రూ 10, అట్టపెట్టెలు రూ10, ప్లాస్టిక్‌ సీసాలు రూ 20, స్టీలు వస్తువులు రూ 20, అల్యూమినియం రూ 120, గాజుసీసా రూ 2 చొప్పున కొనుగోలు చేసి వస్తుమార్పిడి విధానం కావాలని కోరుకునే వారికి కొబ్బరినూనె, దుస్తుల సబ్బులు, ఉల్లిపాయలు, కందిపప్పు, గోధుమపిండి ఇలా పలురకాల నిత్యావసర సరకులు అందిస్తారన్నారు ఈ . కార్యక్రమంలో గ్రామస్థులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *