సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆరోగ్య ప్రదాత మృదుస్వభావి పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆది నారాయణ రావు అని, అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మార్గదర్శకులని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సుంకర ట్రస్ట్ అధ్వర్యంలో నేడు, శనివారం భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో స్థానికులు .. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా సుంకర అది నారాయణరావు సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారిరువురు మాట్లాడుతూ.. 20 లక్షల మందికిపైగా పోలియో వ్యాధి గ్రస్తులకు ఉచితంగా ఆపరేషన్లు చేసిన మహోన్నత వ్యక్తి అది నారాయణరావు అని, వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్ళను దాటిన నిత్య కృషీవలురు అది నారాయణరావు అని అన్నారు.
