సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా అడ్జక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారతీయులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. వీసా కష్టాలయితే మాములుగా లేవు. గతేడాది డిసెంబర్లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మొదట ఈ ఏడాది మార్చ్‌కు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న? వార్త మరింత ఆందోళనకు గురిచేస్తుంది. భారతీయులకు వీసాలు ఇవ్వాలన్న ఉద్దేశం అమెరికా ప్రభుత్వానికి లేనేలేదు’ అని ఒక ఇమిగ్రేషన్ లాయర్ హెచ్చరించారు.గత 50 రోజుల్లో భారత్‌లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని వ్యాఖ్యానించారు. 2027 వరకూ రెగ్యులర్ ఎపాయింట్మెంట్సే లేవని మరో ఇమిగ్రేషన్ లాయర్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్స్‌లో రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్స్ లేకపోవడంతో అధికారులు అపాయింట్మెంట్స్ను వచ్చే ఏడాదికి మర్చారని చెప్పారు. వీసా లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనను అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో దరఖాస్తులు పేరుకుపోయి బ్యాక్‌లాగ్స్‌కు దారి తీసినట్టు తెలుస్తోంది
