సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:అందరికి కనిపించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రాధ సప్తమి పర్వదినం నేపథ్యంలో నేడు ఆదివారం మహిళలు సూర్యునికి చిక్కుడు కాయలు ఆకులతో రధం తయారు చేసి రేగిపళ్ళు ఎర్రటి పుష్పాలతో పూజలు చేసారు.భీమవరం సోమారామం లో శ్రీ సూర్యనారాయణుని అరుదయిన సుందర ఎర్ర విగ్రహానికి విశేషంగా అభిషేకాలు పూజలు జరిగాయి. ఇక తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నేడు, సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారిని ఏడు విభిన్న వాహనాలపై (సప్త వాహన సేవలు) తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం అందిస్తున్నారు. ఈనేపథ్యంలో కొండపి లక్షకు పైగా భక్తులు ఆ వేడుకలు వీక్షిస్తున్నారు. ముందుగా నేటి ఆదివారం ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి సేవలు ప్రారంభమయ్యాయి.తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హంస వాహనం, ఆశ్వ వాహనం, గజ వాహనం వంటి వాహనాలపై స్వామి వారిని ఉరేగిస్తున్నారు. నేటి రాత్రి 8:00 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ దివ్య వాహన సేవలు ముగుస్తాయి.
