సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గత రాత్రి విధులు నిర్వహిస్తున్న ఎన్ కన్నయ్య అనే కానిస్టేబుల్ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలి మరణించారు అని సమాచారం. ఆయనను తెల్లవారు జాము వరకు ఎవరు మరణించినట్లు గుర్తించలేకపోయారు. గుర్తించిన వెంటనే భీమవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు హార్ట్ అట్టాక్ తో మరణించి చాల గంటలు గడిచిందని నిర్ధారించారు. 2002 బాచ్ కి చెందిన కన్నయ్య చిన్న వయస్సులోనే ఆకస్మిక మృతి పట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విషాద వాతావరణం అలముకొంది
