సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి కి డిమాండ్ పెరగటంతో పాటు అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటం తో బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. తాజాగా నేడు బుధవారం (జనవరి 28) పసిడి ధర ఏకంగా రూ.8 వేల పెరిగింది. విజయవాడ, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,70,447ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,51,400ల కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కిలో వెండి ధర కూడా ప్రస్తుతం రూ.3.75 లక్షల వద్ద కు చేరుకొని 4లక్షల దిశగా అడుగులు వేస్తుంది. (Gold, Silver ).
