సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, భీమవరం టీడీపీ నాయకులు విమర్శించారు. అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ టిడిపి ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మతో భీమవరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ వరకు నేడు, ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పిర్యాదు చేసి రోడ్డు బయట రాంబాబు చిత్రపటాన్ని ఉరి తీశారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి పార్ధసారధి, మెఱగాని నారాయణమ్మ,రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు ,రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు,
