సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు నగరంలో 7 ఏళ్లకు ఒకసారి జరిగే తూర్పు వీధి , పడమర విధి గంగానమ్మ జాతరలలో భాగంగా .. నేడు, ఆదివారం పడమర విధి గంగానమ్మ జాతర ప్రారంభమయ్యింది. రేపు సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. వేలాదిగా భక్తులు స్థానికులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని మహా కుంభ నేవేద్యానికి తమ వంతు ఇంటి నుండి తెచ్చిన ప్రసాదాలు కిలో మీటర్ల మేర క్యూ లైన్ లలో నిలబడి నేటి ఉదయం నుండి సాయంత్రం వరకు సమర్పించారు. ఆ ప్రాంత మంతటా రోడ్డులు భారీ ట్రాఫిక్ తో నిలచిపోయాయి. పోలీసులు ఎంతో శ్రమించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ సేవలు అందించారు. స్వచ్చంద సంస్థలు భక్తులకు మంచినీరు పాకెట్స్ మజ్జిగ ఉచితంగా అందించారు.నగరంలో ఏ ఇంట చుసిన బందు మితులు భారీ వంటకాలు తో సందడి సందడిగా ఉంది. బయట ప్రాంతాల నుండి వంటగాళ్లను తెప్పించారు. ఎక్కడ చుసిన షామియానాలలో విందులో విందులు.. . ఈ నేపథ్యంలో గత మూడు నెలలు పాటు ఏలూరులో అక్కడి ప్రజలు కు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు 3 నెలల పాటు నిషేధం. విదించుకొన్నారు. . కొత్త దుస్తులు కూడా ధరించలేదు. . రేవు ఫిబ్రవరి 2న లక్షలాది మంది భక్తులతో ఊరేగింపు.. మధ్యాహ్నం నుండి కొర్ల బండిలో పంబాలమ్మను ఊరేగించి సాయంత్రం గ్రామా పొలిమేరలలో సాగనంపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *