సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షికోత్సవాలు నేపథ్యంలో నేడు, ఆదివారం సుమారు 20 వేల భక్తులు వేడుకలలలో పాల్గోంటున్నారు. ఇక బంగారు తల్లి శ్రీ అమ్మవారి మూలవిరాట్ ని నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం చెయ్యడానికి ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రమణ్యం జ్యోతి దంపతులు లక్షా ఏభై వేలు రూపాయలు విలువైన 11 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ పాల్గొన్నారు
