సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో అడ్డంకులు అధిగమించి అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి (India US ) అంగీకారం కుదిరింది. దీంతో ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగుదేశాల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది. బంగ్లాదేశ్, శ్రీలంకపై టారిఫ్‌లు 20 శాతం కాగా.. పాకిస్థాన్‌పై 19 శాతం, చైనాపై 34 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్, అమెరికా మధ్య జరిగి వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) ‘శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యత మరింత పెంచుతుందని తెలిపారు. మరోవైపు ఈ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు.
