సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ అమెరికా మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందంతో అమెరికా అడ్జక్షుడు ట్రంప్ లో జోష్ పెరిగిపోయింది. ఎన్నోఏళ్ల తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో భారీ మార్పుకు పాకిస్తాన్ నివ్వెరపోయింది. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ‘తాజగా’ విడుదల చేసిన భారతదేశ అధికారిక మ్యాప్‌లో పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారతదేశంలో భాగంగా చూపించారు. చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంలోనే కలిపి చూపారు. భారతదేశం అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తమ మ్యాప్‌లో ధృవీకరించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇది గట్టి సంకేతమని చెబుతున్నారు. పీఓకేపై పాక్ వాదనను అమెరికా పరిగణనలోకి తీసుకోవడం లేదనే విషయం స్పష్టంఅయ్యింది. మరోవైపు అక్సాయ్ చిన్ విషయంలో కూడా అమెరికా భారత్ వైఖరిని సమర్థించి.. చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎన్నోఏళ్ల తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో స్వష్టమైన మార్పు చోటుచేసుకుంది. గతంలో అమెరికా విడుదల చేసే మ్యాప్‌లలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ, ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ (LoC) వద్ద చుక్కల గీతలు పెట్టేవారు. మరిప్పుడు అదే అమెరికా భారత్ ను పూర్తిగా సమర్థిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *