సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం గునుపూడిలో నేడు, శనివారం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివార్ల దేవస్థానం నందు గ్రామస్తులు భక్తులు సేవకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మరియు ఆలయ సిబ్బంది సమక్షంలో గత 72 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల హుండీలు తెరచి లెక్కించగా రూ 9,37,042/-లు మరియు యూఎస్ఏ,1 డాలర్ ఒకటి మరియు ఆస్ట్రేలియా 10,డాలర్ ఒకటి ఆదాయం లభించింది. .మరియు అన్నదానం హుండీ ద్వారా 20,410/- రూపాయలు ఆదాయం లభించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ చింతలపాటి బంగా ర్రాజు సభ్యులు బ్రహ్మ జ్యోశ్యుల సత్య ప్రసాద్, యార్లగడ్డ రమేష్, సాయి విజయలక్ష్మికుమారి మరియు ఆలయప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ, కందుకూరి సోమేశ్వరరావు, కొత్తపల్లి శ్రీనివాస్ మరియు యూనియన్ బ్యాంక్ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
