సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్* కొణితివాడ ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం ; వీరవాసరం మండలం కొణితివాడ గ్రామంలో ఎస్ఎస్ఏ నిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాస్మో పాలిటిన్ సహకారంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పునః ప్రారంభించారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థి చదువు కోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటు పడాలని, విద్యార్థులు బాగా చదువుకుని వివిధ రంగాలలో రాణించాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
