సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పదం అమలులో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నేడు, సోమవారం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్లో జోష్ నింపింది. అలాగే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. గత సెషన్ ముగింపు (83,580)తో పోల్చుకుంటే నేడు సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఏడు వందల పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కాస్త కిందకు దిగి వచ్చింది. మధ్యాహనానికి సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 83,928 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 111 పాయింట్ల లాభంతో 25,805 వద్ద కదలాడుతోంది.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 554 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 553 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.56గా ఉంది.
