సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నేడు, శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ (YS Jagan) తో కలిసి అంబటి మాట్లాడారు. అంబటి రాంబాబు ఇటీవ‌లు అరెస్ట్ అయి.. గురువారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న‌ తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను వైఎస్ జగన్ కు వివరించారు. జగన్ అంబటితో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతల వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరి లెక్కలు త్వరలో తేలుద్దాం అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *