సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల అభివృద్ధి మా లక్ష్యమని డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వారి అభివృద్ది కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలకు రూపొందించామన్నారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు ఇప్పటికే పరిష్కార మార్గాలు అన్వేషించామన్నారు. తీర కాలుష్య నివారణ, కోత నివారణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతులలో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, ఇలా మత్స్యకారులు జీవితాలకు భద్రత, భరోసా కల్పించేందుకు అవసరం అయిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలో పొందుపర్చామని అన్నారు.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలలో అన్ని వసతులతో వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *