సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, శుక్రవారం భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, అయినపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చాల నూతన జిల్లా కమిటీల ప్రకటన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నూతన మోర్చాల కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..బీజేపీలో పదవి అనేది అలంకారం కాదు, అదొక గొప్ప బాధ్యత ఆ బాధ్యతను భుజాన వేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి అని దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలకు తావులేకుండా బీజేపీలో నిస్వార్థంగా పనిచేస్తే తగిన గుర్తింపు దక్కుతుందనడానికి తానే ఒక ఉదాహరణ అని, పాకా సత్యనారాయణను రాజ్యసభ కల్పించడం కూడా ఇదే పద్దతిలో జరిగిందని గుర్తుచేశారు. . అనంతరం రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో 7 అనుబంధ మోర్చాలు వివిధ క్షేత్రాల్లో ప్రజల కోసం పనిచేస్తున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిmభోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపర్ది, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
