సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో కీలక దేశాలన్నీ అమెరికా కు మద్దతు ఇచ్చినందుకు ఇరాన్ కోపాగ్ని కి భారీ నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. అయితే భారత్ మాత్రం మిత్ర దేశం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్ కు మరో మిత్ర దేశం ఇజ్రాయిల్ కు ఇబ్బంది కలిగించకూడదని ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.? అయితే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి యుద్ధం ఆపాలని కోరారు. ఏదైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ మృతికి సంబంధించి భారత్ మౌనంపై సోనియా గాంధీ ఓ జాతీయ మీడియాతో సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు’..ఈ విషయాన్ని మార్చి 1వ తేదీన ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో సుప్రీం లీడర్‌ను హత్య చేయటం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీయటమే. అమెరికా, ఇజ్రాయెల్ నరమేధాన్ని భారత ప్రధాని పట్టించుకోవటం లేదు. కానీ, యూఏఈపై ఇరాన్ చేస్తున్న దాడులను మాత్రం ఖండిస్తున్నారు. ఈ దాడులకు దారి తీసిన సంఘటనల గురించి మాట్లాడటం లేదు. ఖమేనీ హత్యను ఖండించకపోవటం తటస్థ వైఖరి కాదు. బాధ్యతలను విస్మరించటమే. కేంద్రం తీరు వల్ల భారత్ విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు కలుగుతాయి’ అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *